· కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర
· ఐదు హామీల అమలులో కీలకపాత్ర
· బెంగళూరు అభివద్ధిపై ప్రత్యేక దష్టి
· గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్రానికిరూ.10.27లక్షలకోట్ల పెట్టుబడులు
· అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు
· విలాస్‌రావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడిన అపర చాణిక్యుడు
· సోనియా, రాహుల్‌లకు అత్యంత సన్నిహితుడు
· కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు
హైదరాబాద్,నేటిధాత్రి:
డి.కె.శివకుమార్ ప్రస్తుతం కర్ణాకట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాకుండా ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కర్ణాటక అసెంబ్లీకి మొత్తం ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన రామ్‌నగర్ జిల్లా కనకపుర తా లూకా దొడ్డ ఆలహళ్లి గ్రామంలో 1962 మే 15న జన్మించారు. తండ్రిపేరు కెంపేగౌడ, తల్లి గౌరమ్మ. ఆయన ఓపెన్ యూనివర్సిటీలో ఎం.ఎ. పొలిటికల్ సైన్స్‌ను పూర్తిచేశారు.
డి.కె.శివకుమార్ విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై తన 18వ ఏట, పార్టీ అనుబంధ సంస్థ ఎనఎస్‌యూఐలో చేరారు. తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం బెంగళూరు వచ్చి, ఎన్ ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో సాతనూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి జేడీఎస్ అభ్యర్థి దేవెగౌడ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 1987లో సాతనూరు నియోజకవర్గం నుంచి బెంగళూరు గ్రామీణ జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1989లో తొలిసారి సాతనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి అప్పటి ముఖ్యమం త్రి కె.ఎస్. బంగారప్ప మంత్రివర్గంలో జైళ్లశాఖను నిర్వర్తించారు. 1994లో ఆయనకు కాంగ్రె స్ పార్టీ టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1999లో మళ్లీ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎస్.ఎం. కష్ణ మంత్రివర్గంలో పట్టణాభివద్ధి శాఖను నిర్వర్తించారు. 2013 ఎన్నికల్లో విజయం సాధించి సిద్దరామయ్య మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ రాలేదు. అ ప్పుడు జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కుమారస్వామి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999`2013 మధ్యకాలంలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే 2008`10 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం 2020 నుంచి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడి గా కొనసాగుతున్నారు. 1989 నుంచి 2008 వరకు ఆయన మైసూరు జిల్లా సాతనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా, 2008 నుంచి కనకపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికవుతూ వస్తున్నారు.
వక్కళిక సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఒక తమ్ముడున్నారు. ఆయన పేరు డి.కె. సురేష్. డి.కె. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకోగా ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు ఐశ్యర్య, ఆభరణ కాగా కుమారుడి పేరు ఆకాష్. ఆయన పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకు న్నారు. డి.కె. శివకుమార్ దేశంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఆస్తుల విలువ రూ.840కోట్లుగా ప్రకటించారు.
2002లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొ న్నప్పుడు, డి.కె. శివకుమార్ ఆయనకు అండగా నిలిచారు. బెంగళూరు శివార్లలోని రిసార్ట్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వారంరోజులపాటు క్యాంప్ నిర్వహించి, విలాస్‌రావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రానప్పుడు, జనతాదళ్ (సెక్యులర్), కర్ణాటకతో ఒక అంగీకారానికి వచ్చి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అద్భుతమైన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డారు. 2020, జులై 2న ఆయన అధికారికంగా కర్ణాటక కాంగ్రె స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
డి.కె.శివకుమార్‌కు కర్ణాటక రాజకీయాల్లో “ట్రబుల్ షూటర”గా పేరు సంపాదించారు. ముఖ్యం గా 2017 రాజ్యసభ ఎన్నికల్లో అహమ్మద్ పటేల్ విజయం కోసం గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌లో వుంచి క్యాంపు రాజకీయం నిర్వహించారు. డి.కె.శివకుమార్ పార్టీకి ఇప్పటికీ వీరవిధేయుడిగా కొనసాగడమే కాదు పార్టీ కష్టాల్లో వున్నప్పుడు తన అద్భుత రాజకీయ చాణక్య ప్రదర్శనతో గట్టెక్కించిన సందర్భాలు ఎన్నో! ఆయన మనీలాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలు ఎదుర్కొన్నారు. 2019లో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జై లుకు తరలించింది. తన రాజకీయ జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయంగా ఆయన దీన్ని పరిగణిస్తారు. ఇది రాజకీయంగా తాను మరింత బలోపేతం కావడానికి దోహదం చేసిందని చెబుతుంటారు. ఆయన చాలామంది ఆధ్యాత్మిక గురువుల సందర్శనకు వెళుతుంటారు. ముఖ్యంగా “సిద్ధగురువు” సిద్ధేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవ్ పట్ల అత్యంత భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఐదు గ్యారంటీల అమలు విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024`25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం ఈ పథకాలకోసం రూ.1.12లక్షల కోట్లు కేటాయించింది. బెంగళూరు అభివద్ధి మంత్రిగా నగర అభివద్ధికోసం రూ.1.5లక్షల కోట్ల అభివద్ధి ప్రాజెక్టులను ప్రకటించి అమలు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తొలగించడానికి 40 కి.మి. మేర ట్విన్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.42500 కోట్లు ఖర్చు చేయనుంది. నగర పర్యాటకాన్ని పెంచడానికి రూ.500 కోట్లతో భారీ స్కైడెక్ ప్రాజెక్టును చేపట్టారు. బెంగళూరు బిజినెస్ కారిడార్ పేరుతో గతంలో పెరిపెరల్ రింగ్ రోడ్డుగా వ్యవహరించిన ఈ ప్రాజెక్టును రూ.27వేల కోట్లతో రీ డిజైన్ చేశారు. రూ.1700 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టారు.
బెంగళూరు తాగునీటి అవసరాలకోసం రూ.9వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ కో సం ప్రస్తుతం ఆయన పోరాడుతున్నారు. తమిళనాడు వేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేయడం ఆయన సాధించిన రాజకీయ విజయంగా భావిస్తారు. కరువు ప్రాంతాలకు తాగునీరు అందించే “ఎత్తిన హుళే” ప్రాజెక్టును మరింత వేగవంతం చేసేందుకు కషిచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ స్థాయిలో 50 కుటుంబాల నమోదు కార్యక్రమం చేపట్టారు. 2025లో బెంగళూరులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా రాష్ట్రానికి రూ.10.27లక్షలకోట్ల పెట్టుబడులు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. బిడాడి సమీపంలో 9వేల ఎకరాల్లో సరికొత్త “ఏఐ సిటీ” వరల్డ్ క్లాస్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు రూ.52వేల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చ వుతున్నా అభివద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తున్నారు. బెంగళూరు వంటి నగరా ల్లో ఆస్తిపన్ను వసూళ్ల క్రమబద్ధీకరణ, ప్రకటనలు, పాలసీల ద్వారా అదనపు ఆదాయాన్ని సమ కూర్చుకుంటున్నారు. బెంగళూరు చుట్టుపక్కల జిల్లాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్క రించేందుకు “మేకేదాటు” ప్రాజెక్టు కోసం ఆయన పాదయాత్రలు కూడా చేశారు. దీన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్రం నుంచి అనుమతుల కోసం ఒత్తిడి తెస్తున్నారు.
రామనగర జిల్లాలో “ఖుషీ నగర” పేరుతో హెల్త్‌కేర్, ఇన్నోవేషన్ మరియు నాలెడ్జ్ సిటీని అభివద్ధి చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు సత్వరం అందేలా “నమ్మ బెంగళూరు” యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల మధ్యవర్తు ల ప్రమేయం తగ్గి, పారదర్శకత మరింత పెరుగుతుంది. ఆయన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వుంటారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మొత్తంమీద చెప్పాలంటే డి.కె. శివకుమార్ ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా పార్టీకి “ఆర్థికంగా, వ్యూ హాత్మక అంశాల్లో వెన్నెముక”గా వుంటున్నారు.
