
Cyber Awareness Meet in Zahirabad
జహీరాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని స్రవంతి జూనియర్ కాలేజీలో పట్టణ సీఐ శివలింగం ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ మోసాల గురించి, తాగి వాహనాలు నడిపితే తీసుకునే చర్యల గురించి, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే నష్టాల గురించి, షీ టీమ్స్ గురించి, OTPల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.