
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ కోరపల్లి పాఠశాలలో’ స్నేహిత కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణ గురించి శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ, బాలబాలికల సంరక్షణ, ఆరోగ్యము, సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, తదితర అంశాల పై పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్. సమ్మయ్య, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, ఏఎస్ఐ రాధాకృష్ణ, ఎఇఓ మహేందర్, పద్మ, కే సదానందం, రోహిణి శ్రీనివాస్, ఉపాధ్యాయులు చైతన్య, దేవదాస్, సురేష్, ప్రకాష్, నరహరి, శ్రీనివాస్, ప్రేమలత, రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.