హసన్ పర్తి / నేటి ధాత్రి
హాసన్ పర్తి మండల పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2 వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పాక్స్) నూతన భవనము, గోదాం, సీఎస్సీ కామన్ సర్వీస్ సెంటర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా మూడు దఫాలుగా రైతులకు సుమారు 39వేల మేర రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కి దక్కుతుంది. రైతు రుణమాఫీ కానీ వారు ఎవరు అధైర్య పడవద్దని టెక్నికల్ ఇబ్బంది ఉన్న వారిని వ్యవసాయ శాఖ మంత్రి సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీ అయ్యే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు వర్ధన్నపేట నియోజక వర్గ వ్యాప్తంగా రైతులకు సుమారు రుణమాఫీ 436 కోట్ల రూపాయల మేర రుణమాఫీ ఇప్పటి వరకు జరిగింది. అలాగే రుణమాఫీ కానీ వారికి కూడా త్వరలో వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దసరా కానుకగా రైతులు పండించే వరి ధాన్యానికి రూ. 500 బోనస్, అదేవిధంగా దసరా నాడు రైతులకు రైతు భరోసా ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి. రైతు బిడ్డగా రైతు కష్టం తెలిసిన ముఖ్య మంత్రిగా రైతులు అప్పులో పుట్టి అప్పులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సుమారు రాష్ట్రవ్యాప్తంగా 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు అవాక్కులు చేవాక్కులు పేలుతూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు దీనిని రాష్ట్ర ప్రజానికం చూస్తున్నారు ప్రజలు రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టిన కూడా బుద్ధి లేకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని విమర్శలు చేస్తూ, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు సోషల్ మీడియా వేదికల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు కానీ మన ప్రజా ప్రభుత్వం లో మన సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎల్లప్పుడూ అందుబాటు ఉంటూ ప్రజా సమస్యల మీద సమయం కల్పిస్తూ వాటిని పరిష్కరిస్తున్న వ్యక్తి మన సీఎం. ప్రజల కోసమే ప్రజల వద్దకు ప్రజాపాలన తీసుకువచ్చిన ఒక గొప్ప వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, పాక్స్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, పాక్స్ డైరెక్టర్, రైతులు, అధికారులు, డివిజన్ కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళ్లి వెంకట్ రెడ్డి, హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, 2 వ డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, మాజీ ఫాక్స్ చైర్మన్ పొలం అనిల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ సముద్రాల మధు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నలుబోలు రవీందర్, రిజిస్టార్ జగన్ మోహన్ రావు, డిసివో, ఏవో, మార్క్ఫెడ్ డిఈ, అగ్రికల్చర్ ఏడి, అధికారులు రైతులు మహిళా నాయకురాలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.