అటవీ హక్కుల పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలి .

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్

కాటారం నేటి ధాత్రి

అటవీ హక్కుల పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేశారు కాటారం మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సూదుల శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు అనంతం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల పత్రాలకు పంట రుణాలు ఇవ్వడం లేదని వారు అన్నారు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి పంట పెట్టుబడి పెట్టడం మూలంగా పండిన పంట మొత్తం వారికే తాకట్టు పెట్టడం అవుతుందని, పోడు రైతుల మీద ప్రభుత్వలు వివక్ష విడనాడాలని అన్నారు, ఈ జిల్లాలో అటవి పట్టాలు పొందిన రైతులు పదివేల వరకు ఉంటారని ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న రైతులు పంటలకు పెట్టుబడి సరైన సమయంలో అందక తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంటుందని, అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు, అదేవిధంగా ఆగస్టు 9వ తారీఖున కాటారం మండల కేంద్రంలో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం కి పెద్ద సంఖ్యలో ఆదివాసి మేధావులు,ఉద్యోగులు, పెద్దలు, యువతీ యువకులు, విద్యార్థులు, మహిళలు ఆదివాసి ప్రజానీకం అంత పెద్ద సంఖ్యలో హాజరై ఆదివాసి కలలు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ యొక్క సభను ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు, తడండ్ల శ్రీను,మద్దుకూరి శ్రీను, బిల్లం శరత్, కాపుల విజయ్,దయ్యం.వినోద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *