
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
ఐటీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ్యులు వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రాజు గారు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.
తెలంగాణ ఆదివాసి తెలుగు సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అటవీ పట్టాలకు రెవెన్యూ కొత్త పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలని ఎల్డిఎం శ్రీనివాస రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆ సంఘం నాయకులు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి రైతులు 5000కుటుంబాలు పదివేల ఎకరాలకు పొంది ఉన్నారని వారికి పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఒక వైపున రైతు భరోసా రాక మరోవైపున బ్యాంకర్లు పంట రుణాలు చార్జ్ క్రియేట్ అయితలేదు అనే పేరుతోటి ఇవ్వకపోవడం చేత, రైతులు ఆందోళన చెందు తున్నారు అన్నారు, రైతులు చేసేదేమీ లేక ప్రైవేటు వడి వ్యాపారస్తులని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొనడానికి,ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం అని వారు మండి పడ్డారు. వెంటనే ఈ సమస్యపై ఐటీ పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని వారు గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోడు పట్టాలు వచ్చినటువంటి జిల్లాలలో ఇప్పటికే రైతులు పంట రుణాలు బ్యాంకుల నుండి తీసుకున్నారని, ఈ జిల్లాలోనే ప్రభుత్వ అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉంటుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘ అధ్యక్షులు సూదుల శంకర్ మరియు జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు కుమ్మరి గణేష్ అసోదుల కుమార్, కొవ్వూరి కిష్టయ్య, ఓలపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారుపోడు పట్టాలకు పంట రుణాలు ఇవ్వాలి.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్