
తడాసి ముద్ద అయిన వరి ధాన్యం రాసులు
రైతులకు తప్పని తిప్పలు
ప్రభుత్వం అదుకోవాలని కొరుతున్న రైతులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో గాలి వాన తో కూడిన అకాల వడ గాలుల వర్షం భారీగా కురిసింది. మంగళవారం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో గాలి తీవ్రతకు రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు విరిగి పడడంతో పాటు సాగు చేస్తున్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరి పంట చేతికి అందే సమయంలో వర్షం కారణంగా పంట పొలాల్లో వరి పంట నేలకు ఒరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం రాశులు కుప్పలు పూర్తిగా తడిసి పోవడంతో రైతులు ఏమి తోచని పరిస్థితుల్లో తీవ్రంగా రోదిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి పంట ఫలితం చేతికందే సమయంలో ప్రకృతి సృష్టించిన విపత్తుతో పూర్తిగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.