Crop Compensation Distributed to Farmers in Palamaner
*రైతున్నలకు అండగా నిలుస్తోన్న కూటమి ప్రభుత్వం..
*గత ప్రభుత్వం తప్పిదం… ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందుల్లో పడ్డ రాష్ట్రం..
*రైతులను ఆదుకోవడం…ఏనుగుల దాడుల కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి..
*అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలి..
*పంట నష్ట పరిహార చెక్కుల పంపిణిలో ఎమ్మెల్యే అమర్..
పలమనేరు(నేటి ధాత్రి)నవంబర్ 27:
రైతన్నలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పలమనేర్ అటవీ రేంజ్ పరిధిలోని వీ.కోట, బైరెడ్డిపల్లి గంగవరం, పలమనేరు రూరల్ మండలాలకు చెందిన అటవీ ప్రాంత గ్రామాల రైతులకు పంట నష్ట నివారణ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 92 మంది రైతులకు 9.60 లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వం తప్పిదం వల్ల ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయింది అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆదుకుంటున్నదన్నారు. అందులో భాగంగా ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు మూడు నెలలలోనే పరిహారపు చెక్కులను అందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదన్నారు తెలియజేస్తుందన్నారు.ఇక ఏనుగుల దాడులను నివారించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అటవీ అధికారుల సలహాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని పేర్కొన్నారు. ఇలా ఉండగా పంట నష్టపరిహారం తక్షణం అందుతుండటంపై పలు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ పరిహారపు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టిడిపి నాయకులు సోమశేఖర్ గౌడ్, నాగరాజరెడ్డి,ఆర్బిసి కుట్టిలతో పాటు సబ్ డీఎఫ్వో వేణుగోపాల్, ఎఫ్ ఆర్వో నారాయణ, మరియు సిబ్బందితో పాటు పలువురున్నారు.
