భూపాలపల్లి గడ్డపైన ఎగిరేది గులాబీ జెండా
పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని మైలారం గ్రామం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు గండ్ర దంపతులను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించిన వారు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి గండ్ర దంపతుల మీద, బిఆర్ఎస్ నాయకులపై ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడు అనుభవించే పదవులు గండ్ర దంపతుల పుణ్యమే అని అన్నారు.కాంగ్రెస్ నాయకులు ఇచ్చే డబ్బు కోసం ఆశపడే చిల్లర రాజకీయాలను చేస్తూ బతుకునిచ్చిన బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో భూపాలపల్లి నియోజకవర్గంలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు వచ్చి మభ్యపెడుతున్న కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ ఓటిస్తే కష్టాలు తప్పన్నారు. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
మరోసారి గండ్ర దంపతులను విమర్శిస్తే ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, నాయకులు గడిపే విజయ్, చల్ల నరసింహారెడ్డి, మస్కే సుమన్, నూనె కిరణ్, దూదిపాల మోహన్ రెడ్డి, చల్ల మహేందర్ రెడ్డి, జూపాక సందీప్, పేద్దన్న, మస్కే కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.