ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని తిట్టడం తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ పని లేదని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 222 కొట్ల బతుకమ్మ చీరల బకాయిలను ఉంచిపోగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 202 కోట్ల బకాయిలను చెల్లించి, పోచంపల్లిలో ఉన్న స్టాక్ ను కూడా కొనుగోలు చేసేలా కార్మికులను, వస్త్ర పరిశ్రమను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ పందులతో అపరిశుభ్రతతో ఉందనడము సబబు కాదని టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పందులు ఉండేవని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారింది కాబట్టి జిల్లా కేంద్రానికి కావలసిన వసతులను సమకూరుస్తూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజ్ వంటి పనులు అవసరం కనుక అభివృద్ధి పనుల్లో భాగంగా సిరిసిల్ల అభివృద్ధి చెందింది తప్ప ప్రత్యేకంగా మీరు చేసింది ఏమీ లేదని అన్నారు.
కేవలం మీరు మీ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారని, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అన్నారు.
బాపు కేసీఆర్ అభివృద్ధి చేశాడని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం చేసిన అప్పులకు బాధ్యత వహించి మీరు కడతారా అన్నారు.
ఆనాడు ఉద్యమంలో కెసిఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు చేస్తూ ఉద్యమం నడిపించారు అందులో మేమందరం కూడా ఆ నినాదాలకు కట్టుబడే ఉద్యమంలో పాల్గొన్నాము కాబట్టే అందులో భాగంగానే ప్రాజెక్టు లు కట్టాడని అన్నారు.
కేకే మహేందర్ రెడ్డి ఆనాడు ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీకి ఎంతగానో పనిచేసే ప్రజా ప్రతినిధులను గెలిపించుకుని పార్టీని విస్తరించాడు ఈనాడు విమర్శలు చేస్తున్నరన్నారు. ఆనాడు ఏ పార్టీలో ఉండేవారు ఏ స్థాయిలో ఉండేవారు మర్చిపోవద్దని అన్నారు.
ఈనాడు అనవసరపు విమర్శలు చేస్తున్నవారు కేకే మహేందర్ వెంట తిరిగిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు.
కేకే మహేందర్ వేంట తిరిగిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను వెన్నుపోటు పొడిచి డైరెక్ట్ గా కేటీఆర్ ను తీసుకువచ్చి కేవలం 170 ఓట్లతో గెలిపించుకున్నారని అన్నారు. ఇది వెన్నుపోటు కాదా అని అన్నారు.
లేకుంటే ఏనాడో కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ వంటి పదవులు చేపట్టేవారని అన్నారు.
ఆయన గెలిచే టైంలో నోటికాడబుక్కను గుంజుకున్నట్టు చేసింది మీరు కాదా, అలాంటి మీరు కేకే మహేందర్ రెడ్డిని పదేపదే ఓడిపోతున్నాడని విమర్శించడం సరికాదని అన్నారు..
ఇక్కడ వనరులను దోచుకుంది మీరు, ఏ హోదా ఉందని ఎవర్ని భయపెట్టాలని గన్ మెన్ లని పెట్టుకున్నారని అన్నారు. భూకబ్జాలు చేసింది మీరు కాదా అని అన్నారు..
ప్రజలను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకులూరి బాలరాజు, తిరుపతి రెడ్డి,నలిని కాంత్,కోడం అమర్నాథ్, కొడిక్యాల రవి, బొద్దుల శీను, ఇసుక మధు, వేముల రవి,వంగరి దత్తు తదితరులు పాల్గొన్నారు.