విశ్వక్రీడల్లో క్రికెట్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

క్రికెట్‌ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028లో లాస్‌ ఏంజిలెస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్‌ చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటు కల్పించారు.

చివరగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ పోటీల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఉండే.. భారత్‍కు సానుకూలంగా ఉంటుంది. అలాగే, క్రికెట్ మరిన్ని దేశాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. అయితే అప్పట్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‍ను చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి, భారత్ క్రికెట్ నియంత్రణ మండలి చాలా కాలం పాటు కృషి చేశాయి. ఇందుకోసమే 2024 టీ20 ప్రపంచకప్‍ను వెస్టిండీస్‍తో పాటు అమెరికాలోనూ ఐసీసీ నిర్వహిస్తోంది. క్రికెట్‍ను మరిన్ని దేశాల్లో పాపులర్ చేసేందుకు ఒలింపిక్స్ సరైన మార్గమని ఐసీసీ భావిస్తోంది. ఇప్పుడు ఈ వార్త తర్వాత ఒలంపిక్స్​లో క్రికెట్​ను చూసే అవకాశం దక్కుతుందని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!