గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి

తెలంగాణ రక్షణ వేదిక
తెలంగాణ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్

పాలకుర్తి నేటిధాత్రి

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు చివరి తేది సమీపిస్తున్నందున ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు మరలా ఓటు హక్కు ప్రెష్ గా చేసుకోనే విధంగా వీరితో పాటు కొత్త పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునే విధంగా పాలకుర్తి మండలంలోని ఊరూరా సర్పంచ్లు, అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పట్టభద్రుడికి ఫారం 18 ఇవ్వాలని కోరూతూ తెలంగాణ రక్షణ వేదిక, తెలంగాణ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల తహసిల్దార్ తీరందాసు వెంకటేశ్వర్లుని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మేడారపు సుధాకర్, గిలకత్తుల సోమశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్, ఉద్యోగులు, నిరుద్యోగులు ఆన్లైన్ లో అప్లై చేసిన అనంతరం వారిని తహసిల్దార్ కార్యాలయానికి డిగ్రీ వర్జినల్ సర్టిఫికెట్ తీసుకొని రమ్మంటున్నారని, పై చదువులు అవసరాల నిమిత్తం పట్టభద్రుల దగ్గర ఉండకపోవచ్చని, దానికి బదులు వేరే ఏదైనా గుర్తింపు కార్డ్ ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఓటు నమోదు అవగాహన కొరకు ముఖ్య కూడలిలో ప్లెక్సీలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. బూత్ లెవెల్ ఆఫీసర్లను గుర్తింపు కార్డులను వేరిపై చేయడానికి గ్రామాల్లోకి పంపాలని అన్నారు దీనిపై సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ తీరందాసు వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిలకత్తుల సోమశేఖర్ గౌడ్, జలగం అశోక్, కమ్మగాని వెంకటేశ్వర్లు, కోడెం సాయిరాం, అరుణ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!