ఎమ్మెల్యేలు బెదిరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి;
తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం తెలిపారు
గురువారం చండూరు తహసిల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న 11వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా బతుకమ్మలాడుతూ నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 వేల మంది గత 48 సంవత్సరాలుగా పేద మహిళలకు రక్తహీనత పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయుటకు ఎంతగానో కృషి చేస్తున్న అంగన్వాడి టీచర్లకు ఆయాలకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇందులో 90 శాతం మంది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని ఆలోపు వారికి గౌరవ వేతనాలు కాకుండా కనీస వేతనం టీచర్ కు 26 ఆయాకు 18000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు నల్లగొండ జిల్లా నాటి నైజాం సర్కార్ను తరిమికొట్టిన పోరు గడ్డ అని వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందుకున్న అంగన్వాడీ మహిళలని వారిని ఎమ్మెల్యేలు బెదిరిస్తే భయపడేది లేదని వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే పోరాడుతున్న అంగన్వాడీ సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని లేనిపక్షంలో అంగన్వాడీలు చేసే పోరాటాల్లో సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటూ వారికి అండదండలుగా ఉంటూ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలోసిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు దోటి వెంకన్న సిఐటియు సీనియర్ నాయకులుమొగుదాల వెంకటేశం , సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకన్న,బరిగెల రమణమ్మ, నాగమణి, కేదారి, జగదీశ్వరి,తారక, పి జ్యోతి, కే రాజేశ్వరి, బి శోభ, కే శారద, జంగమ్మ, పెద్దమ్మ, ఉష, వనజాత, పద్మ,సునీత,పి సునీత,విజయనిర్మల,అనంతలక్ష్మి,భాగ్యలక్ష్మి,వెంకటమ్మ,పార్వతమ్మ,విజయలక్ష్మి, బి ప్రమీల, జ్యోతి, సుజన, ఎస్ పద్మ,ఆయాలుఅండాలు,సుగుణమ్మ,అనూష,కృష్ణవేణి,సోనీ,సాయమ్మ, వెంకటమ్మ, రాణి, నిర్మలమ్మతదితరులు పాల్గొన్నారు.