నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
సిపిఎం నల్లగొండ జిల్లా 21వ మహాసభల సందర్భంగా డిసెంబర్ 2న మిర్యాలగూడ జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం చండూరుమండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో మిర్యాలగూడలో జరగనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలోఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడేది ఎర్ర జెండా నే అని ఆయన అన్నారు.రైతులకుపంట పెట్టుబడి కిందఇస్తున్న రైతుబంధు,రైతు బీమాపథకాలనుఅమలు చేయాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందుఅనేక హామీలతోఅధికారంలోకి వచ్చినకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుహామీలను అమలు చేయడంలోఘోర వైఫల్యం చెందారనిఆయన విమర్శించారు.అసెంబ్లీ ఎన్నికలు జరిగినేటికీసంవత్సరం కావస్తున్నఇచ్చిన హామీలు అమలు చేయకపోగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజల పైన ఆర్థిక భారాలు మోపారని వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలనిఆయన పిలుపునిచ్చారు.జిల్లా మహాసభలకు జన సమీకరణ చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. చండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కర్షకులు మేధావులు సబ్బండ వర్గాల ప్రజలు హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలనిఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, కే నరసింహ, నారపాక జలంధర్ తదితరులు పాల్గొన్నారు.