భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2024 జూన్ 14, 15 తేదీలలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్ కాలనీలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారు. రాజకీయ శిక్షణ తరగతుల జయప్రడానికి తమ వంతుగా ఆర్థికంగా, హార్థికంగా సహాయ, సహకారాలు విరివిగా విరాళాలు ఇచ్చి భవిష్యత్ పోరాటాలకు తోడ్పాటును అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.
జిల్లాలో పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ పోరాటాలను నిర్వహిస్తుంది. 2020 సంవత్సరములో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కరోనా కాలంలో 11 మండలాల్లో, 450 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించింది.పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సింగరేణి బొగ్గు రంగం రక్షణ కోసం, రైతుల గిట్టుబాటు ధర, పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, మహిళ, యువజన, విద్యార్ధి, దళిత, గిరిజన, సమస్యల సాధన కోసం పోరాడింది. ఉద్యోగుల సమ్యల పరిష్కారానికి ముందుంది. వికలాంగులు, పెన్షన్ దార్ల సమస్యల సాధన కోసం పోరాడింది. జిల్లాలో రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని, జిల్లాలో సాగునీరు, తాగునీరు సమస్య పరిష్కరించాలని సమరశీల పోరాటాలు చేసింది.
భవిష్యత్తులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధికి పోరాడుతున్న సిపిఎం పార్టీ నీ ఆదరించి విరాళాలు ఇచ్చి 2024 జూన్ 14, 15జరిగే రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదానికి, భవిష్యత్ పోరాటాలకు ఆర్థిక, హార్ధికంగా సహకరించాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు రమేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు