వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ నాయకులు

వర్షాలు రాకముందే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం, శనివారం రోజున జైపూర్ మండలంలోని డీసీఎంఎస్ తో పాటు వివిధ గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా దాసరి రాజేశ్వరి జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తానని చెప్పింది.కానీ ఎక్కడ అమలు చేయడం లేదు.దింతో రైతులు కష్టపడి పండించిన పంటలకు రక్షణ లేకుండా పోయింది. కల్లాల వద్ద ఉన్న ధాన్యం అక్కడే ఉంటుంది. ఆ ధాన్యన్ని కాపాడుకోవడానికి రైతులు రాత్రి, పగలు నిద్ర లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దుంపల రంజిత్ కుమార్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ను వెంటనే చెల్లించాలి.కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సన్నపు ధాన్యనికి మాత్రమే ఇస్తాను అనడం సరైంది కాదు.రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రైతులు పండించిన అన్ని రకాల ధాన్యనికి బోనస్ చెల్లించాలి. అంతే కాకుండా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకంలో ధాన్యంను ఎక్కువగా వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. మరియు
జిల్లా అధికారులు స్పందించి ధాన్యాన్ని తరలించే లారీలు కోనుగోల కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచాలి. రైతుల ధాన్యన్ని పూర్తిగా కొనాలి.రైతులకు అన్యాయం చేస్తే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!