
సిపిఐ( ఎం) పార్టీ అనుబంధ సంఘాలలో చేరండి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుండి28 వరకు జరిగేసిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. బుధవారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలోసిపిఎం గ్రామ శాఖ సమావేశానికి సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నేర్మట గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన పేదలకుపింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేర్మట నుండిచుట్టుపక్కల ప్రాంతాలైనపుల్లెంల,శేరిగూడెం, గొల్లగూడెం, బంగారుగడ్డ, లెంకలపల్లి గ్రామాలకు లింకు రోడ్లు లేకపోవడంతోప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే ఈ లింకు రోడ్లకు నిధులు మంజూరుచేసి ఈ రోడ్లు బాగు చేయాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇబ్రహీంపట్నం నుండి ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని అదేవిధంగా దేవరకొండ నుండినాంపల్లి,తిమ్మారెడ్డి గూడెం,ధోని పాముల, నేర్మట, కొండాపురం,చోల్లేడు, మునుగోడు, చిట్యాల, యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ గ్రామంలోప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించిఈ గ్రామంలోప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంనిర్మించాలనిఆయన అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్నమోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్నివిమర్శించారు.ఢిల్లీలోరైతాంగం పండించిన పంటకుమద్దతు ధర ఇవ్వాలనిఉద్యమాలు నిర్వహిస్తుంటేమోడీ ప్రభుత్వంపట్టించుకోకపోవడంవిడ్డూరంగా ఉందన్నారు. గత సంవత్సరంరైతు వ్యతిరేక నల్ల చట్టాలపైపోరాటాలు నిర్వహించిన సందర్భంలోఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోకేంద్ర ప్రభుత్వంపూర్తిగా వైపల్యం చెందిందనిఆయన అన్నారు.ఈ గ్రామంలోకొన్ని వార్డుల్లోరోడ్డు మరమ్మత్తులు లేకప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,అంతర్గత రోడ్లు సిసి రోడ్ల నిర్మాణాన్నివెంటనే చేపట్టాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందుకాంగ్రెస్ ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలనువెంటనే అమలు చేయాలని అన్నారు.సిపిఎంపార్టీఅనుబంధ సంఘాలలోచేరాలనిఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈనెల 22న నేర్మట సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణఉంటుందని, ఈ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులుహాజరవుతారనిఆయన తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణకు, మండల కమిటీ సభ్యులు,పార్టీ సభ్యులు,సానుభూతిపరులు, చుట్టుపక్కల ప్రాంతాలప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలనిఆయన కోరారు.ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ,సిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,అంతిరెడ్డి,ఈరటి వెంకటయ్య,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి,లక్ష్మమ్మ,కొత్తపల్లి లక్ష్మమ్మ,పర్వతాలు, జహంగీర్, నారపాక శంకర్, నారపాక నరసింహ, వెంకన్న, యాదయ్య,ఈరగట్ల నరసింహ, లింగమ్మ, హుస్సేన్, త దితరులు పాల్గొన్నారు.