గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా సి.పి.ఎం ఆధ్వర్యంలో ధర్నా
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపాన తెలంగాణ తల్లి చౌక్ లో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపశమరించుకోవాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సీపీఎం పార్టీ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం
వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం దారుణమని విమర్శించారు దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారుల తోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను ఉపశమరించుకోవాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
నిత్యవసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉండేదని కానీ ఇప్పుడు బిజెపి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ పెంచడం చాలా దారుణమైన విషయం,ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం బెజుగం సురేష్, గుండు రమేష్, గోవిందు లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.