బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు.
. ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.!
