
రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా
పరకాల నేటిధాత్రి
రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.