శేరిలింగంపల్లి నేటి ధాత్రి,:-
లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ రంజిత్ రెడ్డి నీ గెలిపించాలని శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు సీపీఎం విజ్ఞప్తి చేస్తుంది.. ఈ సందర్భంగా సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి C శోభన్, జోన్ కమిటి సభ్యులు V మాణిక్యం,K కృష్ణ,S రవి,K కృష్ణారెడ్డి,B వరుణ్ మాట్లాడారు..
కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ యెుక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా బీజేపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం వీరోచితంగా పోరాడారు .. వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు..
నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు . అధిక ధరల తో ప్రజలంతా అసంతృప్తి తో ఉన్నారు.. నోట్ల రద్దు సమయంలో, కరోనా సమయంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..మరో పక్క దేశ సంపద, వనరులు మొత్తం అంబాని అదాని లాంటి కార్పొరేటు శక్తులకు దార పోశారని అన్నారు.. రైతులకు రుణ మాఫీ చెయ్యకుండా కార్పొరేట్ వాళ్ళ అప్పులు మాఫీ చేశారని అన్నారు.. ప్రజల ఆగ్రహాన్ని పక్క దారి పట్టించేందుకు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు ..
కానీ దేశ ప్రజలు బీజేపీ కుట్రలను అర్థం చేసుకుని ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని సీపీఎం నాయకులు అన్నారు .. ఈ ఎన్నికల్లో కేంద్రం లో బీజేపీ అధికారం కోల్పోయి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు..