చేర్యాలలో సీపీఐ 100 వసంతాల వార్షికోత్సవం
సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 వసంతాల వార్షికోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ. నిర్వహించారు అనంతరం అంగడి బజార్ లోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మరియు సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ మరియు సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సిహెచ్ రాజిరెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షత వహించారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పేద ప్రజల కార్మిక కర్షక సంక్షేమం కొరకు సిపిఐ పోరాటాలు చేసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో రామగళ్ళ నరేష్ ఇర్రి భూమయ్య ఎండి అజీమ్ బండారి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు
