కార్యదర్శులు ఎన్నికైన సీతారాములు, నాగేశ్వరరావు
హామీలు మరిస్తే అధోగతే
గత పాలకుల తప్పిదాలు పునరావృతం కావద్దు సీపీఐ(ఎం) నేత పీ.సోమయ్య
కారేపల్లి నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిస్తే అధోగతి పాలుకాక తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పీ.సోమయ్య హెచ్చరించారు. కారేపల్లి మండలం మాణిక్యారం`1,2, గ్రామశాఖల సమావేశం శుక్రవారం రేపాకుల లాలయ్య నగర్‌లో జరిగింది. ఈసభలో పీ.సోమయ్య మాట్లాడుతూ అధికారంలోకి రావటానికి బూర్జువా పార్టీలు హామీ గుమ్మరించటంలో వాటిని అమలులో షరతులు పెట్టటం అసంపూర్తిగా అమలు చేయటం సర్వసాధారణంగా మారిందని విమర్శించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. పెట్టుబడుల కాలం కావటంతో రైతులు ఒత్తిడికి గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల చేసిన దప్పిదాలను పునరావృత్తం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. చౌకదుకాణాలను బలోపేతం చేయటం ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల బాధలను వదిలేసి మందిరాలు మతం అందిపుచ్చుకుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మైనార్టీలు బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూరాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో ఆరంభశూరత్వం కనపిస్తుందని విమర్శించారు. గిరిజన గిరిజనేతర పోడు సమస్యకు పరిష్కారం రాలేదని సీతారామ ప్రాజెక్టు నీరు కారేపల్లి మండలానికి అందేలా వైరా ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మాణిక్యారం`మొట్లగూడెం బీటీ రోడ్డు వెంటనే చేపట్టాలని పదోతరగతి పరీక్షాకేంద్రాన్ని మాణిక్యారంలో ఏర్పాటు చేయాలని పేదలందరికి పక్కా గృహాలు ఇవ్వాలని రేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులకు పెన్షన్ ఇవ్వాలని మహాసభలోతీర్మానాలు చేశారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు రేపాకుల వీరభద్రం ఎగరవేశారు. కార్యదర్శులుగా కరపటి సీతారాములు పోతర్ల నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మెరుగు సత్యనారాయణ మండల కార్యదర్శి కే.నరేంద్ర నాయకులు వజ్జా రామారావు దాసరి మల్లయ్య కొండబోయిన ఉమావతి కొత్తూరి రామారావు ధారావత్ వస్రాం పాయం వరలక్ష్మి. రేపాకుల వీరమ్మ కల్తీ రామచంద్రు వడ్డూరి వీరబాబు పండగ కొండయ్య కుర్సం శ్రీను దమ్మాలపాటి ప్రభాకర్ కాటేపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.