కార్మిక,నిరుద్యోగ సమస్యల పోరాటంలో ఎప్పుడు ముందే
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో రెండో వార్డులో సిపిఎం శాఖా మహాసభలు నిర్వహించారు. సిపిఎం శాఖ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ సిపిఎం జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ జాతీయ ఉద్యమ పోరాటంలో కమ్యూనిస్టులు విరోచితంగా పోరాటాలు నిర్వహించాలని, ఆనాటి నుంచే నిరుపేదల సమస్యల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ,ప్రజలకు అండగా ఉంటుందని, ఎక్కడ సమస్య ఉన్న అక్కడ స్పందించే తత్వం కమ్యూనిస్టులదని,ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా,గెలిచిన ఓడిన ప్రజలను అంటిపెట్టుకొని ఉండే పార్టీ సిపిఎం అని,ప్రజా పోరాటాలే లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఎం, పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను7 ఎండగడుతూ,నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపుకై, దేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థులు,కార్మిక,కర్షక సమస్యలపై పోరాటాలు నిర్వహించే పార్టీ సిపిఎం అని అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని, కార్పొరేటు సంస్థలకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తుందని,నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారుతున్న అవేమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.ప్రజలపై భారాలు మోపడమే బిజెపి లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాల మెడలు వంచాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్,సాయి తేజ,సిద్దు, నరేష్ అనీల్,కుమార్ లు పాల్గొన్నారు.సిపిఎం పరకాల కమిటీ ఎన్నిక పరకాలలో జరిగిన సిపిఎం శాఖ మహాసభలలో సిపిఎం శాఖ కార్యదర్శిగా బొచ్చు కళ్యాణ్,కమిటీ సభ్యులుగా మడికొండ ప్రశాంత్,బొజ్జ హేమంత్,బొచ్చు ఈశ్వర్, సాయి తేజ ఎన్నుకున్నట్టు తిరుపతి తెలిపారు.