కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి (అజయ్ ) కి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మేజర్ గ్రామపంచాయతీ గుండాల సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి ( అజయ్) పోటీ చేస్తున్న స్థానానికి సిపిఐ పార్టీ సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆ పార్టీ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ మద్దతు ప్రకటించారు. బికోజి గెలుపు కోసం మా పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. సిపిఐ పార్టీ శ్రేణులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలనీ వారు పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో బచ్చల రామయ్య దారా అశోక్,షేక్ ఖదీర్,షేక్ అబ్దుల్ నవి,కాశీం,పొంబోయిన ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
