CPI Blindfold Protest Demands 42% BC Reservation
కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన
బీజేపీ వల్లనే బీసీలకు అన్యాయం
సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
