భూపాలపల్లి నేటిధాత్రి
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మరణం భారత విప్లవోద్యమాలకు,ముఖ్యంగా అణగారిన ప్రజానీకానికి అత్యంత తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ సోమవారం భూపాలపల్లి పార్టీ ఆఫీసులో ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయిబాబా జీవిత కాలం అణగారిన ప్రజల హక్కుల గొంతుకగా పౌర హక్కుల నాయకుడిగా ప్రజా సమస్యలను తన కలం ద్వారా నవతరం విద్యార్థి లోకానికి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిన గొప్ప మహోన్నత మానవత్వం కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. సాయిబాబాను ఏ నేరం చేయకుండానే కేంద్రంలో ఉన్న మనువాద ఫాసిస్టు భావాజాలం కలిగిన బిజెపి ప్రభుత్వం సుమారుగా గత పదేళ్లుగా నాగపూర్ జైల్లో అండా సెల్ లో నిర్బంధించారని చేయని నేరానికి పదేళ్ల కాలం శిక్ష అనుభవించిన భారత విప్లవోద్యమ నాయకుడిగా ప్రభుత్వాల అసమర్థతనానికి నిదర్శనంగా సాయిబాబా మొక్కవోని ధైర్యంతో జైలు గోడలను బద్దలు కొట్టుకొని ముంబై హై కోర్టు ఇచ్చిన తీర్పుతో బయటకు వచ్చి ఆరు నెలలు గడవకముందే అనారోగ్య సమస్యతో తుది శ్వాస విరవడం భారత విప్లవోద్యమాలకు తీరని లోటుగా ఆయన ఆయన అభివర్ణించారు. పీడిత,తాడిత ప్రజల హక్కుల కోసం పనిచేయడం నేరమైతే స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వలస పాలనను ఎదిరించిన ఎందరో త్యాగదనులను ఆనాటి పాలకులు దేశద్రోహులు అన్నారని నేడు మనం వారిని దేశభక్తులుగా కీర్తిస్తున్నామన్నారు. రాజ్య హింసకు వ్యతిరేకంగా పరిపాలనా సౌలభ్యం ప్రజలకు చేరువ కావాలని ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న భూమిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం పన్నాగాలను బయటపెట్టిన సాయిబాబాను నిర్బంధించి అనేక రకాల హింసలకు గురి చేశారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఫాసిస్టు పాలకుల నిర్బంధాలను ,అవరోధాలను అధిగమించిన సాయిబాబా అనారోగ్య సమస్యలను ఎదిరించలేక హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారని అని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో భూమి, భుక్తి విముక్తి పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు . సిపిఐ ఎంఎల్ పట్టణ కార్యదర్శి చంద్రగిరి శంకర్ ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ రాకేష్ రవి పాల్గొన్నారు