భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ ఫొండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రటరీ మారపల్లి మల్లేష్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్ పాల్గొని పేషెంట్లకు బంధువులకు వారి చేతుల మీదుగా అన్నం వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారికి సుమారు 250 నుండి 300 మందికి ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్న జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి ని అభినందిస్తున్నాను అలాగే జిల్లా కేంద్రంలోని నిరుపేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతు నిరుపేదలకు అండగా ఉంటూ నిరంతరం వారికి తోడుగా నిలబడుతున్నారు కావున వెంటనే ప్రభుత్వం ఈ జయశంకర్ ఫొండేషన్ సంస్థను గుర్తించి ఈ యొక్క సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఆకునూరి జగన్ జిల్లా నాయకులు బొచ్చు ప్రకాష్,తాటికొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు