తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో సిపిఐ పార్టీకి సంబంధించి కరపత్రాన్ని విడుదల చేసిన సోమ నాగరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఈనెల తొమ్మిదో తారీఖున మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ యూత్ క్లబ్లో మండల స్థాయి ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నామని ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పాల్గొంటారని అలాగే మండలంలోని అన్ని గ్రామాల సంబంధించిన గ్రామ శాఖ కార్యదర్శి ప్రజా సంకల్ నాయకులు పాల్గొన్నారు కమ్యూనిస్టు పార్టీ చేయాల్సిన అంశాల పైన చర్చించి ప్రజా పోరాటాలు చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క మండల స్థాయి ముఖ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని అలాగే ఉపాధి హామీ పనిలో భాగంగా 200 రోజులు పని కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇయ్యాలని ప్రమాద శస్తు కార్మికులు మరణిస్తే 10 లక్షల బీమా వర్తింపజేయాలని మండలంలో చీర్లవంచ చింతల్ తాన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్వాసితులు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కొక్క ఇంటికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని నిరుద్యోగ యువతకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్వాసితుల సమస్యలు పరిసరించుటకై పోరాటం చేయాలని అలాగే కార్మికులకు ఐడెంటి కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా అమలు చేయాలని సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్రంలో వస్తా పరిశ్రమను గట్టెక్కించడానికి తెలంగాణ రాష్ట్రకాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వస్తా పరిశ్రమ మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాల కార్మికుల జీవన ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లపై పోరాట కార్యక్రమం నిర్వహించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు