చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల నూతన సీఐగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎల్. శ్రీను ని మంగళవారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఐని శాలువాతో ఘనంగా సన్మానించారు. చేర్యాల సర్కిల్ పరిధిలోని ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ వద్దకు వచ్చి కలవాలని సూచించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ వారికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మద్దూరు మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, ధూల్మిట్ట మండల కార్యదర్శి వలబోజు నర్సింహా చారి, చేర్యాల మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు, రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పొన్నబోయిన మమత, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు గూడెపు సుదర్శన్, నంగి కనకయ్య, తిగుల్ల కనకయ్య తదితరులు ఉన్నారు.