వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇండ్లు వెంటనే ఇవ్వాలి
సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని, పేద ప్రజల హక్కుల కోసం సమస్యల కోసం ఉద్యమిస్తున్న సిపిఐ పార్టీని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్ శాఖ మహాసభ కటికారెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని సుదీర్ఘ చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఉందని, సిపిఐ శతజయంతి ఉత్సవాలను సిపిఐ శ్రేణులు ప్రతి శాఖలో ఘనంగా నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్ అర్హులైన వారిలో కొందరికి ఇంకా అందడం లేదనీ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నగర శివారు చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆరులైన పేదల చేత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వెళ్తామని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని, నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సిపిఐ నాయకులు ఎర్రం యాదగిరి, కంపెళ్ళి కొమురయ్య, కాల్వల శ్రీనివాస్, రాకం భాస్కర్, నందమల్ల యేసు బాబు, కాల్వ మల్లేశం, జే.బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.