
CPI District Secretary Panjala Srinivas.
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ
డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మండలాల వారిగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపిదేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తామని ఇందుకు అనుగుణంగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్లు నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దేనమిది నెలలు గడుస్తుందని అటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆపార్టీలకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుందన్నారు. తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవిలేకరుల సమావేశంలో జమ్మికుంట, ఇల్లందకుంట సిపిఐ మండల కార్యదర్శిలు గజ్జి ఐలయ్య, మాదారపు రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్ రెడ్డి, సారయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.