సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పేదలకు అండగా… పోరాడే పార్టీ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఇజ్గిరి రాంగోపాల్
వీణవంక, నేటి ధాత్రి:
వీణవంక మండల కేంద్రంలో శుక్రవారం సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసి పార్టీ జెండాను మండల కార్యదర్శి రాంగోపాల్ ఆవిష్కరించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలో 100 సంవత్సరాలుగా
కార్మికుల, రైతుల, విద్యార్థి, యువజనుల పక్షాన మహాతరమైన పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించడం చరిత్ర సిపిఐ కి ఉందని
హైదరాబాద్ సంస్థానంలో రాచరిక పాలన అంతముందించి ప్రజాస్వామ్య పరిపాలనకు నడుం బిగించిన సిపిఐ పార్టీ అశేష త్యాగాలను చేసింది ఉరికొయాలను ముద్దాడింది. ప్రపంచం గర్వించే విధంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచే విధంగా రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపింది
దున్నేవాడికి భూమి కావాలని ప్రభుత్వం ప్రజలందరికీ కనీస అవసరాలు అయిన కూడు, గూడు ,గుడ్డ ఏర్పాటు చేయాలనే కార్యక్రమ ఎజెండా నీ ప్రభుత్వాల ముందు పెట్టీ వాటిని సాధించడంలో క్రియాశీలకమైన పాత్ర సిపిఐ పార్టీ పోషించింది. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని, భవిష్యత్ భారతదేశ రాజకీయాలకు ఎర్రజెండానే ప్రత్యామ్నాయమని, రానున్న రోజుల్లో మండలంలో గ్రామ గ్రామాన సిపిఐ విస్తరిస్తామని ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, బుర్ర సతీష్, బాలగోని చిరంజీవి తాటి కంటి ప్రకాష్ ,పూదరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
