మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
ఇటీవల జరిగిన సిపిఐ కరీంనగర్ జిల్లా మహాసభలో నూతనంగా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పరిచయం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను పంజాల శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. పంజాల శ్రీనివాస్ విద్యార్థి దశ నుండే చురుకైన వాడని, విద్యార్థి, యువజన రంగాలలో పనిచేసి, పార్టీలో జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగాడని ప్రజా సమస్యల పై అధికారులు కలిసినప్పుడు స్పందించాలని కలెక్టర్ ను వెంకటరెడ్డి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటనలో శ్రీనివాస్ తెలిపారు.