ఎన్నికల హామీల అమలుకోసం పోరాడాలి-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
ఎన్నికల హామీల అమలు కోసం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రామడుగు గ్రామశాఖ మహాసభ జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అర్హులైన వారికీ ఇండ్లు ఇవ్వకుండా సొంత పార్టీ కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని, ప్రజల సమస్యలను పట్టించుకొనే నాదుడులేరని వెంటనే స్తానిక ఎన్నికలు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే, ప్రజా ఉద్యమాలు తప్పవని సృజన్ కుమార్ హేచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, మండల నాయకులు కీర్తి కుమార్, దాము భూమయ్య, యోగి బీరయ్య, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.