Chada Venkata Reddy Pays Tribute to Mallavva
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు మాతృమూర్తి న్యాలపట్ల మల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామంలో రాజు నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించిన అనంతరం మల్లవ్వ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గునుకులకొండాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో న్యాలపట్ల మల్లవ్వ పాత్ర ఉందని, గత నలభై సంవత్సరాలుగా వారి కుటుంబమంతా సిపిఐకి అండగా ఉంటున్నారని, తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, ఇందుర్తి శాసనసభ్యులుగా పని చేస్తున్న కాలంలో మల్లవ్వతో, వారి కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మల్లవ్వ చిన్న కుమారుడు రాజు విద్యార్థి యువజన దశ నుండే అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నాడని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొని కేసుల పాలై జైలు జీవితం గడిపాడని, నాడు జనశక్తి వారితో ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ గానీ వారి కుటుంబం గానీ మొక్కవోని ధైర్యంతో ఉన్నారని, కుమారునికి ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ ఎంతో ధైర్యంగా ఉండేదని అలాంటి మల్లవ్వ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేయడంతో పాటు అండగా సిపిఐ ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల సిపిఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీరు సత్యనారాయణ, నాగెళ్లి లక్ష్మారెడ్డి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బూడిద సదాశివ, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపు రెడ్డి, నవాబుపేట మాజీ ఉపసర్పంచ్ ఎలగందుల రాజయ్య, సిపిఐ మండల నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, అంజయ్య, తదితరులు ఉన్నారు.
