సిపిఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి..
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జనవరి 18న ఖమ్మంలో శతజయంతి ఉత్సవాల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ను సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ , ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ లు ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడారు. 1925 డిసెంబర్ 26 సిపిఐ పార్టీ కాన్పూర్ లో ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి చట్టసభల్లో కార్మికుల, కర్షకుల, విద్యార్థుల కు అనేక చట్టాలు చేసినటువంటి ఘనత సిపిఐ పార్టీకి ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వారి హక్కుల కోసం పోరాడే పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీది కీలకపాత్ర అని గుర్తు చేశారు. వచ్చేనెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇప్ప కాయల లింగయ్య, మామిడి గోపి, వనం సత్యనారాయణ, వెంకటస్వామి, మిట్టపల్లి పౌలు, దేవానంద్, రాజేశం, రాజన్న, సాంబయ్య, రమేష్, కొమరయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
