నర్సంపేట,నేటిధాత్రి :
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అందుకు సంబంధించిన ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ,ఎన్నికల కమిషన్ అధ్వర్యంలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసినది.ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా నర్సంపేట పట్టణ సమీపంలోని మహేశ్వరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించ్చారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ ఏర్పాట్లతో పాటు, తనిఖీలు నిర్వహించాల్సిన తీరును పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.తనిఖీల్లో వాహనాలను,అనుమానితులను
క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు.