
Naspoor Police Station
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్బంగా కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, భౌగోళిక పరిస్థితులు,సిబ్బంది పనితీరు,అలాగే స్టేషన్ పరిధిలో ఎక్కువగా నమోదయ్యే కేసులపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డులను కమిషనర్ పరిశీలించారు.పెండింగ్ కేసులపై ఆరా తీసి,నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అధికారుల నుండి వివరంగా అడిగి తెలుసుకున్నారు.రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్శనలో సీపీ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ (ఐపీఎస్), మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,మంచిర్యాల రూరల్ సీఐ అశోక్‌కుమార్,సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ పాల్గొన్నారు.