దేశంలో నమోదవుతున్న కోవిడ్‌`19 కేసులు

భయపడాల్సిన అవసరం లేదు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

చిన్నచిన్న ఉత్పరివర్తనాలు సహజం భయం వద్దు: డాక్టర్లు

దేశవాసుల్లో రోగనిరోధకశక్తి బాగా పెరిగింది: డాక్టర్లు

రాకపోకలపై ఆంక్షలు లేవు: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

ముంబయి ప్రశాంతం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోవిడ్‌ భయం లేదు

ద.కొరియా, జపాన్‌ దేశాల్లో పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్ల ధరలు

సింగపూర్‌లో వేగంగా విస్తరిస్తున్నా మరణాలు లేవు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో గత కొద్ది రోజులుగా కోవిడ్‌`19 కేసులు బయటపడుతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన అడ్వయిజరీలో, వ్యాధి తీవ్రత చాలా తక్కువగా వున్నదని, ఎటువంటి భయం అవసరంలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం మే 19 నాటికి దేశ వ్యాప్తంగా 257 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నమోదైన వాటిల్లో అత్యధిక కేసుల్లో తీవ్రత చాలా తక్కువగా వున్నందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. ఇంటివద్దనే వీటికి చికిత్స తీసుకుంటే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు రోజువారీ సమాచారం వెల్లడిస్తోంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయా రాష్ట్రాలు అడ్వయిజరీలు జారీచేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మే 19 నాటికి కేరళలో 95G, మహారాష్ట్ర 56G, తమిళనాడు 66G, కర్ణాటక 8G, గుజరాత్‌ 6G, ఢల్లీి 3G కోవిడ్‌ కే సులు నమోదయ్యాయి. కోవిడ్‌కు ఇప్పుడు ఇతర వైరల్‌ వ్యాధుల మాదిరిగానే చికిత్స అందించవచ్చునని భయపడాల్సిన అవసరంలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రతను పాటించడం, పెద్ద సమూహాలకు దూరంగా వుండటం వంటి ముందు జా గ్రత్త చర్యలు పాటిస్తే, కోవిడ్‌ను నివారించవచ్చునని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎస్‌పీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీ సెర్చ్‌ (ఐసీఎంఆర్‌)లు ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ా19 తీవ్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా కోవిడ్‌ కే సులు నమోదవుతున్నాయి. ఇదిలావుండగా పుదుచ్చేరి, రాజస్థాన్‌, సిక్కిం, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ కేసులు నమోదు కావడం, దేశంలో వ్యాధి విస్తరిస్తున్న తీరును వెల్లడిస్తోంది. 

రోగుల డిశ్చార్జ్‌

మే 12 నుంచి దేశవ్యాప్తంగా 112 మంది కోవిడ్‌ సోకిన రోగులకు చికిత్స అందించి, తగ్గిన తర్వాత ఇళ్లకు పంపేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ఇదిలావుండగా మే 29న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నేతృత్వంలో దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై ఒక సమావేశం జరిగింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ డివిజన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గన్నారు. ఇదిలావుండగా కోవిడ్‌కు సంబంధించిన లక్షణాలతో ఇద్దరు రోగులు గత జనవరిలో మృతిచెందినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వీరిద్దరికి ఇతర మెడికల్‌ కాంప్లికేసన్స్‌ వున్నట్టుకూడా స్పష్టం చేసింది. మహారాష్ట్రలో గత జనవరి నెలలో 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించగా వీటిల్లో 106 కోవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. వీటిల్లో 101కేసులు ముంబ యిలో కాగా మిగిలినవి, పూణె, ఠాణె మరియు కొల్హాపూర్‌లో నమోదయ్యాయని వివరించింది.కేవలం మనదేశంలో మాత్రమే కాదు, దక్షిణకొరియా, చైనా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల్లో కూడా కోవిడ్‌ వేగంగా విస్తరిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరంలేదని, తగిన చికిత్స అందుబాటులో వున్నదని ఆయా దేశాలు హెల్త్‌ అడ్వయిజరీలు జారీచేశాయి. అంతేకాదు వ్యాక్సినేష న్‌ గురించిన తాజా సమాచారాన్ని తమకు తెలపాలని, కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చునని ఆయా దేశాలు ఆరోగ్య మంత్రిత్వశాఖలు అడ్వయిజరీలు జారీచేశా యి. 

బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు మౌనంగా వుండాలని పిలుపునిచ్చింది. ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితి అదుపుతప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అత్యవసర పరస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందు కు ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు సిద్ధం చేశామని కూడా వివరించింది. ఇదిలావుండగా బెంగళూరులో 84ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌`19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత మరణించినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ ఈ వృద్ధుడు మే 17న మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికార్లు ధ్రువీకరించారు. ఆయన మే 13న ఆసుపత్రిలో చేరగా, కోవిడ్‌`19 పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన మరణించిన తర్వాత వచ్చిన రిపోర్ట్‌లో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో కర్ణాటకలో కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార్లు అప్రమత్తమయ్యారు. వీటిల్లో 32 కేసులు కేవలం బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ రోజువారీ కార్యకలాపాలను నిరభ్యంతరంగా నిర్వహిస్తూనే, కొన్ని సాధారణ ముం దు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రజల రాకపోకల పై ఏవిధమైన ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మం త్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడిరచారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా చాలాకాలం తర్వాత రాష్ట్రం లో తొలికేసు తీరప్రాంతమైన విశాఖపట్టణంలో బయల్పడటం గమనార్హం. రోగి కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన డాక్టర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇదిలావుండగా తెలంగాణలో ఒక కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ వ్యాధి సోకింది ఒక వైద్యుడికి కాగా, ఆయనకు ప్రయాణ చరిత్ర వున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. అయితే ఐదు రోజులు ప్రొటకాల్‌ పాటించిన తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కోవిడ్‌ లక్ష ణాలు లేవు. ఇదిలావుండగా కోవిడ్‌ వైరస్‌కు చిన్నచన్న ఉత్పరివర్తనాలు సహజమని, ప్రజల్లో ఇప్పటికే రోగనిరోధకశక్తి బాగా పెరిగిపోవడంతో, భయపడాల్సిన అవసరంలేదని డాక్టర్లు చెబుతున్నారు. 

రెండు మ్యుటేషన్లు కారణం

ఒమిక్రాన్‌ బిఎ.2.86కు సంబంధించిన జెఎన్‌.1 వేరియంట్‌కు చెందిన ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8మ్యుటేషన్లు తాజాగా బయల్పడుతున్న కోవిడ్‌`19 కేసుల్లో కనిపిస్తున్నాయని అధికార్లు చెబుతు న్నారు. ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్‌, హాంకాంగ్‌ల్లో కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడిరచిన సమాచారం ప్రకా రం జె.ఎన్‌.1 వేరియంట్‌కు సంబందించి 30 మ్యుటేషన్లున్నాయి. వీటిల్లో ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8 వర్షన్లు తాజా కేసుల్లో కనిపిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇదిలావుండగా హాంకాంగ్‌లో కోవిడ్‌ా19 పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకోమారు కోవిడ్‌ చురుగ్గా కనిపిస్తుండటాన్ని గుర్తించారు. దీన్నొక సైక్లిక్‌ ప్రాసెస్‌గా అక్కడి వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కాగా దక్షిణ కొరియాలో 65 సంవత్సరాలు దాటినవారికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ కాలపరిమితిని జూన్‌ నెలాఖరు వరకు పొడిగించారు. గత మూడేళ్ల కాలాన్ని నిశితంగా పరిశీలిస్తే కోవిడ్‌ ప్రధానంగా చలి, ఎండాకాలాల్లో బాగా వ్యాపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇదిలావుండగా సింగపూర్‌లో ఏప్రిల్‌ 27 నుంచి మే 3 మధ్యకాలంలో అంటే వారంరోజుల్లో 14,200 కోవిడ్‌ కేసులు నమోదయ్యా యి. అంతకు ముందువారం దేశంలో నమోదైన కోవిడ్‌ కేసుల సంఖ్య 11,100. 

పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్లు

 కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన కోవిడ్‌ కిట్‌ తయారీ కంపెనీలు, హ్యుమాసిస్‌ కంపెనీ, ల్యాబ్‌ జీనోమిక్స్‌ కంపెనీ, సీజిన్‌ ఇన్‌కార్పొరేషన్‌, ఎస్‌.డి. బయోసెన్సార్‌ ఇన్‌కార్పొషన్‌ షేర్లు అమాంతం పెరిగిపో యాయి. ఇక ద.కొరియాకు చెందిన ఎస్‌.కె. బయోసైన్స్‌ కంపెనీ షేర్లు ఏకంగా 7.2% వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఒక కొరియాకు చెందిన డయాగ్నస్టిక్‌ కిట్‌ తయారీ సంస్థ సుజన్‌ టెక్‌ ఇన్‌కార్పొరేషన్‌ షేర్లు ఏకంగా 29% పెరిగాయి. ఇక జపాన్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ డైసీ శాంక్యో సంస్థ షేర్లు 7.4% పెరిగాయి. ఇక హాంకాంగ్‌కు చెందిన షాంఘై జున్సీ బయోసైన్సెస్‌ కంపెనీ షేర్లు కూడా వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 

గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌

ఆసియా దేశాల్లో కోవిడ్‌`19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఒ) మే 19న సమావేశమైంది. ఈ సందర్భంగా కోవిడ్‌`19పై ప్రపంచ దేశాల మధ్య గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌ను కోరుతూ స్లొవేకియా ప్రవేశపెట్టిన తీర్మానానికి 124 సభ్యదేశాలు అనుకూలంగా ఓటువేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!