Manik Rao Meets Additional Collector Over SC, ST Reservation Issue
అడిషనల్ కలెక్టర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన
◆-: శాసనసభ్యులు మాణిక్ రావు ..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మునిసిపాలిటీకి జరగబోయే ఎన్నికలలో 37 వార్డులకు కాను మొన్న ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రిజర్వేషన్ల కేటాయింపులలో షెడ్యూల్ క్యాస్ట్ ,షెడ్యూల్ ట్రైబల్ వర్గానికి కేటాయింపులలో తీవ్ర అన్యాయం చేశారని శాసనసభ్యులు మాణిక్ రావు గారు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రని అందజేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ,ఎస్టీ స్థానాలను పెంచాలని 15 శాతం ఎస్సీ లకు, 7 శాతం ఎస్టీల స్థానాలను పెంచుతూ తిరిగి సవరణ చేయాలని అడిషనల్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,వెంకట్,యువ నాయకులు ముర్తుజా,దీపక్ తదితరులు ఉన్నారు..
