మొగిలిచెర్ల ప్రధాన రోడ్డుపై వెళ్తున్న బైక్ ను, వెనుకనుండి బలంగా ఢీకొట్టిన టిప్పర్, ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
ప్రధానరోడ్లపై ఇష్టారాజ్యంగా నడుస్తున్న క్రషర్ టిప్పర్లు..?, స్పందించని క్రషర్ యజమాని?
క్రషర్ యాజమానుల అత్యాశ?.., బీహార్ యువకులే డ్రైవర్లు..?
నేటిధాత్రి, మొగిలిచెర్ల, వరంగల్
తేదీ 06.01.2025, సోమవారం రోజున ఉదయం, కాశిబుగ్గకు చెందిన బయ్య సమ్మయ్య పోచమ్మ దంపతులు, కాశిబుగ్గ నుండి ఆత్మకూరుకు వెళ్తున్న క్రమంలో, మొగిలిచర్ల ప్రధాన రహదారిలో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ సమీపంలోకి రాగానే, క్రషర్ కి సంబంధించిన “టిఎస్03యుబి8467” అను నంబర్ గల “టిప్పర్” అతివేగంతో, అజాగ్రత్తగా బీహార్ కి చెందిన యువకుడు నడుపుతూ, బైక్ పై వెళుతున్న బయ్య సమ్మయ్య దంపతులను వెనకనుండి బలంగా ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో, త్రుటిలో ప్రాణలతో బయటపడ్డారు దంపతులు. ఢీకొట్టిన వెంటనే దంపతులిద్దరూ అక్కడే కింద పడిపోయారని, తలకు తీవ్రగాయం అవడంతో, రోడ్డుపై అధిక రక్తస్రావం అయి అస్వస్థతకు గురికావడంతో వారిని చూసిన స్థానికులు వెంటనే, ప్రమాదానికి కారణం అయిన ట్రిప్పర్ను ఆపి, గీసుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గీసుగొండ పోలీసులు వచ్చి ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. టిప్పర్ డీ కొట్టడంతో కిందపడ్డ దంపతులకు కాలుకు, తలకు బలమైన గాయాలు కావడంతో, వెంటనే స్థానికులు గాయపడిన దంపతులను 108 ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం అవడంతో ఎంజీఎం నుండి ములుగురోడ్డు లోని గార్డియన్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. గార్డియన్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. యాక్సిడెంట్ చేసిన వెంటనే బీహార్ యువకుడు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ట్రిప్పర్ నడిపిన బీహార్ యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి లేడని సమాచారం. డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. క్రషర్ వ్యాపారి సంపత్ రావుకు చెందిన టిప్పర్లు ప్రతిరోజు ఇదే రోడ్లపై బీహార్ వ్యక్తులచే ఇష్టారాజ్యంగా నడపబడుతూ, అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నారు అని స్థానికుల ఆవేదన. అజాగ్రత్తగా ట్రిప్పర్ నడిపిన డ్రైవర్ పై, ఎలాంటి అనుమతులు లేకుండా ట్రిప్పర్లను ఇష్టారాజ్యంగా నడుపుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా టిప్పర్లను నడిపిస్తున్న క్రషర్ యజమాని సంపత్ రావుపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు గీసుగొండ పోలీసులను కోరుతున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న బయ్య సమ్మయ్య, మరో వారంరోజుల్లో అయ్యప్ప మాల విరమణ చేసే ముందే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడంతో, అయ్యప్పస్వామి దీవెనలతో, తీవ్ర గాయాలతో ప్రాణప్రాయం నుండి బయటపడ్డారని అంటున్నారు. ప్రమాదానికి కారణం అయిన క్రషర్ టిప్పర్ యజమానికి సమాచారం ఇచ్చిన కానీ జరిగిన ప్రమాదంపై రెస్పాండ్ కావట్లేదు అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.