మొగుళ్లపల్లి నేటిదాత్రి :
మండలంలోని మొగుళ్లపల్లి ముల్కలపల్లి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవంలో భక్తులు తమ ఆరాధ్యదైవమైన అమ్మవార్లకు మొక్కిన మొక్కులను తీర్చి సమర్పించిన కానుకలు లెక్కింపు మండల కేంద్రంలోని శివాలయంలో సోమవారం రోజున మొగుళ్లపల్లి ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాటుచేయగా తహసీల్దార్ సునీత దేవాదాయ ధర్మాదాయ ఏ ఈ. నాగేశ్వరావు, అనిల్ కుమార్, మహిపాల్, జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు బుర్ర సదయ్య, ప్రధాన కార్యదర్శి మల్సాని నర్సింగరావు, ఉపాధ్యక్షులు, చదువు అన్నారెడ్డి, పాల్గొని భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీలను జాతర కమిటీ సభ్యులచే కానుకలు లెక్కించగా 7 లక్షల 81 వేల 413 రూపాయల కానుకలను శ్రీ సమ్మక్క సారాలమ్మ వనదేవతలకు భక్తులు సమర్పించుకున్నారని దేవాదాయ ధర్మాదాయ ఏ ఈ నాగేశ్వరావు తెలిపారు..