# మున్సిపాలిటీలో ఖర్చుల వివరాలు కోరిన బీఆర్ఎస్,భాజపా కౌన్సిలర్స్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ లకు చెందిన పది మంది కౌన్సిలర్స్ ఆ మున్సిపాలిటీలో ఖర్చులు చేసిన నిధుల వివరాలు తెలుపాలంటూ సమాచార హక్కు చట్టం ప్రకారంగా మున్సిపల్ శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నర్సంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కుంట పడుతుందని అన్నారు.ప్రతి జనరల్ బాడి సమావేశంలో అభివృద్ధి కోసం ఎంత పట్టుబట్టిన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయి బడ్జెట్ మాత్రం విపరీతంగా పెరిగిందని ప్రజలు దీంతో కౌన్సిలర్ పై నమ్మకం పోతున్నదని వాపోయారు.2020 జనవరి 27 నుండి ప్రస్తుతం 30 జూలై 2024 వరకు వార్డులలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఎన్ని పనులు చేశారు. మున్సిపల్ కార్యాలయం నిధుల నుండి ఎంత వరకు ఖర్చులు చేశారు. ఎంత మందికి చెక్కులు ఇచ్చారు.
వాటి పూర్తి సమాచారం ఇవ్వాలని శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ దే తిరుమల సదానందం,2వ వార్డ్ కౌన్సిలర్ జుర్రు రాజు, 3వ వార్డు కౌన్సిలర్ లూనావత్ కవిత వీరన్న, 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు, 6వ వార్డు కౌన్సిలర్ రామసహాయం శ్రీదేవి సుధాకర్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ గద్దె రజిత చంద్రమౌళి, 11వ వార్డు గంప సునీత రఘునాథ్,13వ వార్డు కౌన్సిలర్ రుద్ర ఓంప్రకాష్ మల్లేశ్వరి, 17వ వార్డు కౌన్సిలర్ బోడ గోల్యా నాయక్,23వ వార్డు కౌన్సిలర్ బాణాల ఇందిర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.