పరకాల నేటిధాత్రి
హనుమకొండ పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని బుధవారం రోజున 14వ వార్డు 53వ బూత్ లో మహిళలతో ఇంటింటి బొట్టు కార్యక్రమం స్థానిక కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ బిఆర్ యస్ పార్టీ ద్వారా నే ప్రజలకు అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ఆరోగ్య బీమా 15 లక్షల వరకు అగ్రవర్ణ పేదల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు బండి వెంకటేష్,కన్వీనర్ కో కన్వీనర్ ఎండీ మక్సుద్ అలీ, బొమ్మకంటి నాగరాజు,100 ఓట్ల ఇన్చార్జిలు పాడి భగవాన్ రెడ్డి,దేశిని శ్రీనివాస్,ఎండీ బియాబాని,తోట నూతన్ కుమార్,ఎండీ ఉమర్,దగ్గు రాజేశ్వర రావు,కర్నే రాకేష్, కొక్కిరాల సంపత్,గందే అనిత,రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.