
పరకాల నేటిధాత్రి
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలను కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.మదర్సా పిల్లలతో కలిసి కేకు కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ మానవ మహోపకారి మహమ్మద్ ప్రవక్త అని,ముస్లింలకే కాక సమస్త మానవజాతికి సంపూర్ణ మార్గదర్శకులని,ప్రవక్త సమాజ సంక్షేమం కోసం సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని,మానవాళికి సత్య ధర్మాన్ని తెలియజేస్తూ వారి ఇహపర సాఫల్యా ల కోసం కృషి చేసినారని కొనియాడినారు.ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ నబి శుభాకాంక్షలు తెలిపినారు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సాజిద్ అలీ, ఖయ్యూం,వరుపట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.