జననీ సీడ్స్ సర్కార్ బిజీ
పరకాల,నేటిధాత్రి
రైతులు మేలైన విత్తనాలను ఎంచుకొని అధిక దిగుబడులు పొందాలని జనని సీడ్స్ జోనల్ మేనేజర్ పిఎస్ కోటేశ్వరరావు పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఎండి. రహీం అనే రైతు చేను లో జననీ సీడ్స్ వారి సర్కార్ బిజీ II ప్రతి విత్తనాన్ని రైతు క్షేత్ర ప్రదర్శన జరిగింది.ఈ యొక్క ప్రదర్శనకు వివిధ గ్రామాల నుంచి సుమారు 400 నుంచి 450 మంది రైతులకుపైగా పాల్గొన్నారు.సర్కార్ బిజి ll ప్రత్తి విత్తనాన్ని సందర్శించారు. సర్కార్ బిజి ll ఇంత వర్షాలు ఎక్కువ అయినప్పటికీ. సర్కారు విత్తనం చాలా బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు,సర్కార్ నిటారుగా పెరిగి కాయ లావుగా ఉండి చెట్టుకు 80 నుంచి 90 కాయలు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కంపెనీ జోనల్ మేనేజర్ పిఎస్ కోటేశ్వరరావు పాల్గొని రైతులకు సర్కార్ బిజి ప్రత్తి విత్తనంపై అవగాహన కల్పించారు.బెట్ట పరిస్థితిలోనూ,పచ్చదోమ తెల్ల దోమ నుంచి తట్టుకుంటుందని ఆయన రైతులకు వివరించారు గింజ శాతం ఎక్కువ ఉండి ప్రత్తి బరువు ఉందని,ప్రత్తి తీయడానికి బాగా సులువు ఉంటుందని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ వాస శంకర్ రావు,కంపెనీ ఏరియా మేనేజర్ గొడిశాల రంజిత్ కుమార్,కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.