టెస్కోలో ఎంక్వౌరీ బుట్టదాఖలేనా!

`ఎవ్వరికీ అర్థం కానీ టెస్కోలో అవినీతి ఆట!

`అధికారుల ఆధిపత్యాల ముందు ఫైళ్లు మాయం కావాల్సిందేనా?

`గత సర్కారులో శైలజా రామయ్య మీద విమర్శలు.

`అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేసిన ఆరోపణలు.

`తాము అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని ప్రకటనలు.

`టెస్కోలో అవినీతి జరిగిందని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

`త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

`పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

`బిఆర్‌ఎస్‌ హయాంలోనే కమీషనర్‌ ను పక్కన పెట్టేశారు.

`బుద్ద ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించారు.

`అయినా మార్పు రాలేదు.

`అలుగు వర్షిణిని కమీషనర్‌ చేశారు.

`ఎంక్వౌరీ చేయమని ఆదేశాలిచ్చారు.

`చర్యలు తీసుకోవాలని జయేష్‌ రంజన్‌ లెటర్‌ రాశారు!

`ఎంక్వౌరీ పూర్తి చేసి రిపోర్ట్‌ తయారు చేశారు.

`కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్‌ అందించారు.

`ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు!

`ఎంక్వౌరీ చేసిన అలుగు వర్షిణిని తొలగించారు.

`నిజాయితీగా రిపోర్ట్‌ ఇచ్చిన అలుగు వర్షిణికి స్థాన చలనం కల్పించారు.

`ఆరోపణలు ఎదుర్కొంటున్న శైలజా రామయ్యకు మళ్ళీ పోస్టింగ్‌ ఇచ్చారు.

`విచారణ రిపోర్ట్‌కు మంగళం పాడారు.

`ఆధిపత్య పోరుకు దారులు వేశారు.

`అలుగు వర్షిణి వచ్చాక ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు.

`అవినీతికి పాల్పడినట్లు తేలడంతో తప్పించారు.

`కాంట్రాక్టు ఉద్యోగులకు ఇష్టానుసారం జీతాలు పెంచారు.

`నేటిధాత్రి లో వార్తలు వస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

`అహానికి పోయి బెదిరింపులు చేస్తున్నారు.

`టెస్కోలో జరిగిన అవినీతి బైటకు రాకుండా పిల్లిమొగ్గలు వేస్తున్నారు.

`నాకంటే ఎవరు ఎక్కవా..నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా అంటున్నారు?

`ఉద్యోగులను బెదిరిస్తూ కూడా అదిరింపులకు గురి చేస్తున్నారు.

`నేటిధాత్రి అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

`వార్తలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని భయపెట్టాలని చూస్తున్నారు?

`వ్యవస్థలన్నీ నా చేతుల్లోనే వున్నాయంటున్నారు?

`కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ టెస్కోలో అవినీతి గురించి మాట్లాడుతూనే వున్నారు!

`కేటిఆర్‌ ఎంక్వౌరీ చేసుకొమ్మని సవాలు విసురుతూనే వున్నారు.

`అలుగు వర్షిణి ఇచ్చిన రిపోర్ట్‌ మూలన పడేశారు.

`ఎవరు ఎవరి రాజకీయం కోసం ప్రయత్నం చేస్తున్నారు?

`ఎవరు ఎవరి రాజకీయ ప్రయోజనాలు కాపాడుతున్నారు?

`అందరూ రాజకీయమే చేస్తున్నారు!

`రిపోర్ట్‌ గురించి మాత్రం వదిలేస్తున్నారు.

`రాజకీయ పార్టీలు అధికారుల మధ్య చిచ్చుపెడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ టెస్కోలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ పెద్దలకు పట్టింపు కరువైందా? అదికారుల మధ్య ఆధిపత్యంపోరుకు కేంద్రమైందా? జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయం జరుగుతోందా? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకునేవారు ఎవరైనా వున్నారా? పాలకులకు తీరక లేకుండాపోతోందా? సంబంధిత మంత్రికి కూడా సమయం దొరక్కుండాపోతోందా? అవినీతి జరిగినా ఫరవాలేదని వదిలేయాలనుకున్నారా? టెస్కోలో గతంలో అవినీతి జరిగిందనేది నిజమా? కాదా? అది అబద్దమని అనుకుంటున్నారా? అదే నిజమైతే మంత్రి తుమ్మల నగేశ్వరరావు తొందరపడి ప్రకటన చేశారా? టెస్కోలో ఏమీ జరగలేదని చెప్పడానికి పెద్ద సమయం కూడా అవసరం లేదు? జరిగితే చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడాల్సిన అవసరం లేదు? అవినీతి జరిగిందని నిరూపిస్తే గత పాలకులపై ప్రజల్లో మరింత వ్యతిరేక సృష్టించొచ్చు. రాజకీయంగా పరంగా కాంగ్రెస్‌కు మరింత మైలేజీ సాధించొచ్చు. గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందన్న విషయాన్ని వెలుగులోకి తేవొచ్చు. గత పాలకులను ప్రజల ముందు దోషులుగా నిరూపించొచ్చు. అంత మంచి అవకాశాన్ని ప్రభుత్వం ఎందుకు వదులుకుంటోంది? గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు మొదలుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు పెద్దఎత్తున అవినీతి జరిగిందని చెబుతూనే వస్తోంది. చీరల కొనుగోలులో పెద్ద గోల్‌ మాల్‌ జరిగిందని చెబుతూనే వస్తోంది. ఇప్పుడు వదిలేస్తే కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన మాటలు అబద్దాలని ప్రజలకు ప్రభుత్వమే చెప్పినట్లు కాదా? తాము ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన విమర్శలు అర్ధం లేనివని ఒప్పుకున్నట్లు కాదా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఓవైపు ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అక్కడక్కడా టెస్కొలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావిస్తూనే వున్నారు.

సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్‌ నేతలు గత ప్రభుత్వం మీద సమయం వచ్చినప్పుడల్లా అవినీతి జరిగిందని ఆక్షేపిస్తూనే వున్నారు. కాని ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టడం లేదు. అసలు టెస్కొలో అవినీతి జరిగిందా? లేదా? జరిగితే ఎంత జరిగింది? పది నెలలుగా ప్రభుత్వం ఏం చేస్తోంది? గతంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దఎత్తున ఆరోపణలు గుప్పించిన సమయంలోనే అప్పటి ప్రభుత్వం ఆ సమయంలో వున్న ప్రస్తుత ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, కమీషనర్‌ శైలాజా రామయ్యను మార్చారు. ఆ ఐఏఎస్‌ స్ధానంలో మరో ఐఏఎస్‌ బుద్ద ప్రకాశ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. అయినా అవినీతి గురించి ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీని తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. రాజకీయంగా బిఆర్‌ఎస్‌ ఇరుకునపడిరది. దాంతో అప్పటి ప్రభుత్వం బుద్ద ప్రకాశ్‌ను కూడా తొలగించి మరో ఐఏఎస్‌ అలుగు వర్షిణికి పోస్టింగ్‌ ఇచ్చారు. పైగా టెస్కొలో జరిగిన అవినీతి అక్రమాలపై రిపోర్టు తయారు చేయమన్నారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ సాగించమన్నారు. ఆమెకు విశేష అదికారాలు కూడా ఇచ్చారు. ఆమె విచారణ చెపట్టారు. తవ్వినకొద్ది అక్రమాలు బైటపడుతుండడంతో అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌రంజన్‌కు రిపోర్టు చేశారు. ఆయన వెంటనే పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలని సూచిస్తూ జిఏడికీ లెటర్లు కూడా రాశారు. దాంతో అలుగు వర్షిణీ నేతృత్వంలో విజిలెన్స్‌ కమిటీ విచారణ పూర్తి స్ధాయిలో మొదలు పెట్టింది. అదే సమయంలో అవినీతికి పాల్పడినట్లు తేలిన ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించడం అక్రమని వారు కోర్టును ఆశ్రయించారు. కాని అప్పటి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ వల్ల కాంట్రాక్టు ఉద్యోగుల వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాని అదే ఉద్యోగులు తిరిగి అప్పీల్‌కు వెళ్లారు.

ప్రసుత్త ప్రభుత్వం సరైన కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో కొలువులు పోయిన ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వచ్చారు. అంటే ఒక ఉన్నతాదికారి వున్నప్పుడు వేసిన కౌంటర్‌ ఫైల్‌ ఏమైంది? మళ్లీ కోర్టుకు వెళ్లిన ఉద్యోగులకు అండగా నిలిచిందెవరు? అన్నది ప్రత్యేకంగాచెపాల్సిన పనిలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి తెలిసే జరగుతోందా? లేక తెలియకుండానే జరిగిపోతోందా? ఇక గతంలో టెస్కొలో జరిగిన అవినీతి మీద గత ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాల మరేకు వచ్చిన రిపోర్టు కూడా ప్రస్తుత ప్రభుత్వం ముందే వుంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కాని ప్రభుత్వం ఇంత వరకు ఆ రిపోర్టును పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదన్న రిపోర్టు విచ్చిందా? అంటే అదీ లేదు. అవినీతి జరిగిందన్న రిపోర్టు ప్రస్తుత ప్రభుత్వం ముందే వుంది. అయినా చర్యలు లేవు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విచారణ చేపట్టాలని అనుకుంటుందా? అప్పుడు రిపోర్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న రిపోర్టు వస్తే కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలు అవాస్తవం కాదా? ఇలా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినా పరవాలేదనుకుంటున్నారా? కేవలం రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసమే గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసిందా? కొన్ని వేల సార్లు కేటిఆర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పిన మచ్చట్లన్నీ ఉత్తుత్తివేనా? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? తమ మీద వచ్చిన ఆరోపణల మీద గత ప్రభుత్వం విజిలెన్స్‌ ఎంక్వౌరీ వేయించింది. నిజానిజాలు బైట పెట్టాలనే నిజాయితీ అదికారి అలుగు వర్షిణికి ఆ బాధ్యత అప్పగించారు. ఆమె పూర్తి స్ధాయిలో విచారణ జరిపారు. అవినీతి పెద్దఎత్తున జరిగిందని రిపోర్టు తయారు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ఆమె రిపోర్టు ప్రజా ప్రభుత్వానికి అందించింది. కాని విచిత్రమేమిటంటే విచారణ చేపట్టి రిపోర్టు తయారుచేసిన ఐఏఎస్‌ అధికారి అలుగు వర్షిణికి స్ధాన చలనం కలిగింది. ఎవరి హాయాంలో అవినీతి జరిగిందన్న ఆపవాదులున్నాయో? ఆ శైలజా రామయ్య మళ్లీ కమీషనర్‌గా వచ్చింది. అంటే ఏం జరిగింది? అవినీతి జరగలేదని ప్రభుత్వం ఒప్పుకున్నట్లా? లేక ఒక్క ఐఏఎస్‌ అధికారి కోసం కాంగ్రెస్‌పార్టీ ఆరోపణలన్నీ అబద్దమని ఒప్పుకున్నట్లా? ఎవరు సమాదానం చెబుతారో చూడాలి.

ఇక జరుగుతున్న దానిపై గతంలో జరిగిన అవినీతిపై అనేక ఆధారాలను ముందు పెట్టి నేటిధాత్రి వరస కథనాలు రాస్తోంది. దాంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఆ వార్తలు మింగుడు పడడం లేదు. నేటిధాత్రి వార్తలు నచ్చడం లేదు. దాంతో నేటిధాత్రి మీద బెదిరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మేం తల్చుకుంటే ఏదైనా చేస్తామంటున్నారు? వ్యవస్ద మా చేతుల్లో వుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే నేటిధాత్రికి ఇలాంటి బెదింపులు కొత్తకాదు. కాని ప్రభుత్వం ఏం సమాదానం చెప్పాలనుకుంటోందో తెలియాల్సిన అసవరం వుంది. గత ప్రభుత్వం విచారణ చేపట్టడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఎవరికీ అన్నది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం లేదా? గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం ఈ పాలకులు కూడా చేస్తున్నారా? అన్న అనుమానం కూడా రాకమానదు. అదే నిజమేతే ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు ఎందుకు ఎక్కుపెడుతున్నారు? పదే పదే కేటిఆర్‌ కూడా ప్రభుత్వాన్నే సవాలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ చేసుకోండని సూచిస్తున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు కదడలం లేదు. జరిగిన వాస్తవాలను బైట పెట్టిన నేటిధాత్రిని బెదిరిస్తారా? టెస్కొలో అవినీతి జరిగిందని చెప్పిన ప్రభుత్వ పెద్దలే మీన మేషాలు లెక్కిస్తుంటారా? ఇంకా ఎంత కాలం? ఎవరి ప్రయోజనాల కోసం విచారణ చేపట్టడం లేదు? ఎవరి రాజకీయాల కోసం గతంలోనే చేపట్టిన విచారణ బైట పెట్టడం లేదు? ఏదొ ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాని నేటిధాత్రిని బెదిరింపులకు గురిచేస్తే సరిపోతుందా? అన్యాయమైపోతున్న టెస్కొను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!