కూకట్పల్లి,మార్చి14 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని మొగులమ్మ కాలనీలో గతంలో నిధులు మంజూరై ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న భూగర్భ డ్రై నేజీ పనులను డివిజన్ కార్పొరేణ్డ టర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించ డం జరిగింది.ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ మొగులమ్మ కాలనీలో గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ చిన్నగా ఉండడంతో నిత్యం నిండిపోయి ప్రజాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీలో నివాసాలు పెరిగినందున ప్రజల అవ సరాల దృష్ట్యా ఇప్పుడు ఒక ఫీట్ పైప్ లైన్ తో పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మించేందుకు పనులు ప్రారంభించా రని అన్నారు. నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమా ణాలతో త్వరితగతిన పూర్తి చేయా లని సంబందింత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాన్, భాస్కర్,మల్లేష్,నాగరాజ సాయి గౌడ్, కేబుల్ సాయి తదితరులు పాల్గొన్నారు.