కూకట్పల్లి డిసెంబర్ 14 నేటి ధాత్రి ఇంచార్జ్
124 డివిజన్ పరిధిలోని మహంకా ళి నగర్లో నూతనంగా నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివి జన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్
గౌడ్ గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లా డుతూ నాణ్యత ప్రమాణాల విష యంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపది కన పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముంద స్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికా రులకు సూచించారు.అలాగే కాలనీ లోని రెండు గల్లీలలో పెండింగ్ ఉన్న సీసీ రోడ్లను అతి త్వరలో పూర్తి చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు.కార్యక్ర మంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, నిరంజన్ యాదవ్,ధాతి రమేష్,షౌకత్ అలీ మున్నా,మల్లేష్, పోశెట్టిగౌడ్,ఫారూ ఖ్,ఖలీమ్,వర్క్ ఇస్పెక్టర్ రవి కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1